ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవాళ నిర్వహించిన ఈ కార్యక్రమానికి 48 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎస్పీ ప్రతాప్ కిషోర్ ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ యొక్క విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేయకుండా నేరుగా తమ సమీప సబ్-డివిజన్, సర్కిల్ పోలీసు అధికారులకు అందించవచ్చన్నారు.