NGKL: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో సిబ్బంది నిష్పక్షపాత ధోరణి పాటించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ లోని ఫంక్షన్ హాలులో ఇవాళ జరిగిన పంచాయతీ ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వరాదని కోరారు.