WNP: ఉప్పరిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నరసింహ గౌడ్ ను గెలిపించుకుంటే ఉప్పరిపల్లిలో ఏ సమస్య ఉన్న వెంటనే పరిష్కరిస్తామని సోమవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. మండలం ఉప్పరిపల్లిలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు ,కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రతి ఒక్కటి గెలిచిన వెంటనే నెరవేరుస్తామని హామీచ్చారు.