AP: తిరుపతి సంస్కృతి వర్సిటీలో జరిగిన లైంగిక దాడి కేసుపై హోంమంత్రి అనిత స్పందించారు. తిరుపతి SP, పోలీసు, ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసులు వెంటనే ఫిర్యాదు తీసుకున్నారని చెప్పారు. తిరుపతి SP వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. విద్యార్థినికి న్యాయం చేస్తామని, ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.