WGL: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాయపర్తి మండలంలోని కాట్రపల్లి, పాన్య నాయక్ తండాల్లో ఇవాళ నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలు పార్టీకి పట్టం కట్టే దిశగా ముందుకు వెళ్తున్నారు అని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ గెలవబోతుందన్నారు.