SRPT: ఈనెల 14న జరగనున్న స్థానిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలకు పాల్పడితే. అట్టి అభ్యర్థులు, వారి అనుచరులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మోతే మండల ఎస్సై అజయ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా, న్యాయంగా జరిగేందుకు పోలీసులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.