కడప: గిట్టుబాటు ధర లేక నష్టపోయిన ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సేవాసమితి జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణ డిమాండ్ చేశారు. సోమవారం దువ్వూరు తహసీల్దార్ సంజీవరెడ్డికి ఆయన వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలన్నారు.