కర్నూలులో బీసీ భవన్ నిర్మాణానికి రూ.2 కోట్లు, కాపు భవన్ కోసం రూ.1.5 కోట్లు టీజీవీ గ్రూప్ అందిస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం బి. క్యాంపులో ఆయన ఈ పనులను పునఃప్రారంభించారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం భవనాల పనులు ప్రారంభమైందని చెప్పారు. సీఎం చంద్రబాబు విజనరీ నాయకత్వంలో కర్నూలు అభివృద్ధికి తాను కృషి చేస్తున్నానని మంత్రి వెల్లడించారు.