WGL: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ వహించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. ఇవాళ కార్యాలయం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించిన ఆమె, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత విభాగాల ఉన్నతాధికారులకు వాటిని అందజేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.