VZM : డా పివిజీ రాజు కళావేదిక, హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గురజాడ కళాభారతి ఆడిటోరియంలో జరిగిన అమ్మచెక్కిన బొమ్మ నాటికను ప్రజలు గొప్పగా ఆదరించారని భీశెట్టి బాబ్జి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని రచన చేసిన జ్యోతిరాజ్, దర్శకుడు గోవాడ వెంకట్ అద్భుతమైన ప్రదర్శన చేశారన్నారు.