వందేమాతరం పై చర్చ సందర్భంగా పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర ఛటర్జీని ప్రధాని బంకిం దా అని సంబోధించడంపై తృణమూల్ MP సౌగత్ రాయ్ అభ్యంతరం చెప్పారు. సోదరుడు అనే సంబోధించేందుకు బెంగాలీ భాషలో ‘దా’ అని వాడతారని.. అంతటి గొప్ప వ్యక్తికి ఆ పదం వాడటం సరికాదన్నారు. ‘బంకిం బాబు’ అని సంబోధించాలని సూచించారు.