నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థలలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.