ATP: అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల నిమిత్తం వచ్చిన వారి వినతులను పరిశీలించారు. ప్రజలు, రైతుల సమస్యలను పరిష్కరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.