ATP: ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు మాతృమూర్తి వైకుంఠ సమారాధన కార్యక్రమంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితం మరణించిన సీఎం రమేష్ నాయుడు మాతృమూర్తి రత్నమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.