TG: వికసిత్ భారత్-2047లో తెలంగాణ రైజింగ్ కూడా ఓ భాగమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకు వెళ్తోందన్నారు. 2047లోగా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ ఎదగాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని తెలిపారు.