ఇప్పటికే ఆహా, ఈటీవీ విన్ తదితర OTTలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా, తెలుగులో మరో OTT సంస్థ వచ్చింది. చాయ్ బిస్కెట్ సంస్థ.. చాయ్ షాట్స్ అనే కొత్త OTTని తీసుకొచ్చింది. ఇది తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ అందించేలా రూపొందించబడింది. మైక్రోడ్రామా సిరీస్‌లు, ఒరిజినల్ షోలతో ఈ OTT ప్రేక్షకులను అలరించనుంది. ఇందులోని సిరీస్‌ల్లో ప్రతి ఎపిసోడ్ 2 నిమిషాలలోపు ఉంటుందట.