రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రో-కో’ ప్రపంచ స్థాయి బ్యాటర్లని గంభీర్ ప్రశంసించాడు. ఈ విషయాన్ని తాను గతంలో కూడా చెప్పినట్లు గుర్తుచేశాడు. వారిద్దరి అనుభవం వన్డే ఫార్మాట్లో భారత జట్టుకు ఎంతో అవసరమని తెలిపాడు. భవిష్యత్తులో కూడా వారు ఇదే విధంగా ఆడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు.