MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తుండడంతో ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. జన్నారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో 2 రోజులుగా విద్యుత్ కోతలు తీవ్రమయ్యాయి. దీంతో చిన్న వ్యాపారులతో పాటు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రతి 10 నిమిషాలకోసారి విద్యుత్ పోతుందని వారు వాపోయారు, విద్యుత్ కోతలను ఎత్తివేయాలన్నారు.