PPM: బలిజిపేట మండలం వంతరం గ్రామంలో ఉన్నకేజిబివి పాఠశాలను కలెక్టర్ ఆదివారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. బాలికలు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం సురక్షితమైన వాతావరణం అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. వసతి గృహంలో వంటగదిని తనిఖీచేసి శుభ్రత పాటించి, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.