NLG: సర్పంచ్ అభ్యర్థి శ్రీపాద పుష్పలత ఎన్నికల్లో చేసిన హామీలను నెరవేర్చలేకపోతే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని ₹100 బాండ్ పేపర్‌పై లిఖితపూర్వకంగా ఇచ్చారు. తనను గెలిపిస్తే గ్రామంలో మరో అండర్‌పాస్ కోసం కృషి చేస్తానని, రెండు సంవత్సరాల్లో ఆ పని పూర్తి కాకపోతే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని ప్రజల ముందే చెప్పారు.