NLR: బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పెనుబల్లి, కళాయకా గొల్లు మధ్య సదరన్ చానల్ కాలువకు గండి పడిన విషయం తెలిసిందే. నాలుగు రోజులైన గండి పూడ్చకపోవడంతో పొలాల్లో నీరు చేరి నార్లు పాచిపోయాయి. ఉన్నతాధికారులు స్పందించి గండి పూడ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు విన్నవిస్తున్నారు.