VSP: అరకులోయ మండలం ఇరగాయి పంచాయతీ పరిధి ఉరుములులో ఎలుగుబంటి దాడిలో గిరిజనుడికి తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అప్పారావు గ్రామ సమీపంలోని కాఫీ తోటకి కాపలగా వెళ్లాడు. ఆదివారం అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రుడిని 108లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.