తెలుగు రాష్ట్రాల్లో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్‌లో 77 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 39 విమానాలు, శంషాబాద్‌కు రావాల్సిన 38 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. అలాగే, విశాఖ నుంచి 7 ఇండిగో విమానాలు రద్దు అయినట్లు అధికారులు వెల్లడించారు. వైజాగ్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లాల్సిన విమానాలు రద్దు అయినట్లు తెలిపారు.