NRPT: గత ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నర్వ మండలంలో దారుణ దుస్థితికి చేరుకున్నాయి. మండలంలోని కొత్తపల్లి సహా పలు గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు మొత్తం కంపచెట్లు, పిచ్చి మొక్కలతో నిండిపోయి, ఆటలకు ఉపయోగపడకుండా పోయాయి. క్రీడా ప్రాంగణాలు పనికిరాకుండా పోతుండటంపై యువత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.