పౌరవిమానయాన శాఖ మార్గదర్శకాల ప్రకారం టికెట్ల ధరలపై పరిమితి విధించనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. దీంతో ఎకానమీ క్లాస్ టికెట్ల ధరలపై పరిమితి విధించనున్నారు. దీన్ని మరికొన్ని గంటల్లో అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం దృష్ట్యా DEC 6న విమాన టికెట్ల ధరలను పౌరవిమానయాన శాఖ క్రమబద్దీకరించి ఆయా ఎయిర్‌లైన్స్‌కు మార్గదర్శకాలు జారీచేసింది.