SRCL: చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన విషాదం నింపింది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పాటి సురేందర్ అనే వ్యక్తి ఆదివారం చికెన్ తింటుండగా, ఒక ముక్క గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సురేందర్ మృతితో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.