సత్యసాయి: కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయం ఈవో మురళీకృష్ణ అమ్మవారి వెండి ఆభరణాలు, చీరలు చోరీ చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. భార్యతో కలిసి ఆటోలో వస్తువులు తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు ఈవో దంపతులను అదుపులోకి తీసుకుని, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ తాజాగా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.