ADB: రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు, మూడు విడతలుగా జరిగే పంచాయతీ ఎన్నికల ప్రాంతాల్లో లోకల్ హాలిడే ఉంటుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలియజేశారు. పోలింగ్ ప్రాంతాల్లో ఈనెల 11, 14, 17 తేదీలలో ప్రభుత్వ కార్యాలయాలు, లోకల్ బాడీ, ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు.