MHBD: దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచి అభ్యర్థి కసిరెడ్డి స్పందన-నవీన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను సర్పంచిగా గెలిస్తే గ్రామంలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పాలేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డోర్నకల్ MLA రామచంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.