నెల్లూరులో టౌన్ బస్ డ్రైవర్, కండక్టర్పై దాడి చేయడం హేయమైన చర్యని సీఐటీయూ నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు అన్నారు. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్సూర్, సలీంను ఆదివారం సీఐటీయూ నాయకులు పరామర్శించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.