ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్, పశువుల సంత ద్వారా రూ. 3.32 లక్షల ఆదాయం వచ్చిందని మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు. శనివారం జరిగిన గొర్రెలు, మేకల సంతతో రూ.190 లక్షలు,ఆదివారం ఎనుములు, ఎద్దులు, ఆవులు సంతతో రూ.1.41 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ నగదును సోమవారం బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు.