విజయనగరం కలెక్టరేట్లో ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు పీజీఆర్ఎస్ నిర్వహిస్తారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో పాటు గత అర్జీల స్లిప్పులు తీసుకుని రావాలని సూచించారు. అర్జీ స్థితిగతుల కోసం కాల్సెంటర్ 1100, Meekosam.ap.gov.in ను ఉపయోగించవచ్చన్నారు.