ADB: గుడిహత్నూర్లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు మండలంలోని మన్నూర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ప్రధాన రహదారి నుంచి పక్క దారిలోకి ఎగిరిపడటంతో పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్ సిబ్బంది వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.