GNTR: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో సమర్పించిన అర్జీల స్థితిని టోల్ ఫ్రీ 1100 ద్వారా తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. అర్జీలను మీకోసం వెబ్సైట్లో లేదా నేరుగా కూడా అందించవచ్చని సూచించారు. కలెక్టరేట్, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.