విక్టరీ వెంకటేష్‌కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించనున్నట్లు తెలుస్తోంది. వెంకీ, దర్శకుడు అనుదీప్ KV కాంబోలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీలో రష్మిక కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రష్మికకు అనుదీప్ కథను వినిపించగా.. ఆమె ఓకే చెప్పినట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.