డైరెక్టర్ వైశాఖ్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న సినిమా ‘ఖలీఫా’. ఈ మూవీలో మోహన్ లాల్.. మంబరక్కల్ అహ్మద్ అలీ పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే మోహన్ లాల్, పృథ్వీరాజ్ ఇందులో తాతామనవళ్లుగా కనిపిస్తారని టాక్. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. మొదటి భాగం 2026 ఓనం సందర్భంగా విడుదల కానున్నట్లు సమాచారం.