ADB: హైదరాబాద్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అదివారం జరిగిన అండర్ 19 రాష్ట్రస్థాయి బాలురు, బాలికల ఖో ఖో ఫైనల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు విజయం సాధించాయి. బాలుర జట్టు రంగారెడ్డి జిల్లాపై, బాలికల జట్టు నల్లగొండ జిల్లాపై గెలుపొందాయి. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా డీఐఈఓలు విద్యార్థులను, కోచ్, ఎస్టీఎఫ్ కార్యదర్శి బాబురావును అభినందించారు.