W.G: ఆక్రమణలు తొలగింపులో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. భీమవరంలో వీరమ్మ పార్కు రైతు బజార్, కొత్త బస్టాండ్, రైల్వే జంక్షన్, ప్రకాశం చౌక్ ప్రాంతాలలో ఆదివారం రెవిన్యూ, మున్సిపల్ శాఖ అధికారులతో కలసి జేసీ సుడిగాలి పర్యటన చేశారు. ఫుడ్ కోర్టు ఏర్పాటు, ఆక్రమణలు తొలగింపు, పారిశుద్ధ్యంపై అధికారులకు పలు సూచనలు చేశారు.