MBNR: సర్పంచ్ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అన్నాసాగర్ లోని ఆయన నివాసంలో అడ్డాకుల మండల, రాచాల గ్రామానికి చెందిన నాయకులు మాజీ ఎమ్మెల్యేను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని విమర్శించారు.