NZB: జిల్లా కేంద్రానికి చెందిన ఖేలో ఇండియా ఆర్చరీ కోచ్ మురళీ జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా నియమితులయ్యారు. ఈ నెల 10 నుంచి 19 వరకు HYDలోని బేగంపేట HPSలో నిర్వహించనున్న 42వ సీనియర్ నేషనల్ ఆర్చరీ పోటీలకు ఆయన టెక్నికల్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నియామక పత్రాన్ని విడుదల చేశారు.