MLG: తాడ్వాయి మండలం కాల్వపల్లిలో మంత్రి సీతక్క ఆదివారం పర్యటించారు. కాంగ్రెస్ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా BRS పార్టీ గ్రామాన్ని పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్లు, మహిళా-రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.