SKLM: రాష్ట్రంలో బీసీల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఆదివారం బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఆ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆదరణ-3 పథకం అమలుకు త్వరలో అభిప్రాయ సేకరణ జరుగుతుందని తెలిపారు.