SKLM: శ్రీ కూర్మం లోని కూర్మనాథ స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ రవి నాధ్ తిలహరి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానాతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో తాబేలు పార్కు, శ్వేత పుష్కరిణి పరిశీలించారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజల చేశారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.