VZM: తెర్లాం MRO హేమంత్ కుమార్ మరో నాలుగు బృందాలతో కలసి ఆదివారం మండలంలో గల రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు సంబంధించి రైతుల నుంచి రైస్ మిల్లర్లు ఏ విధంగా ధాన్యం సేకరిస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి అధికంగా ధాన్యం వసూళ్లు చేసినట్లు ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.