AKP: పరవాడ సబ్బవరం మండలాల్లో అసంపూర్తిగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్లు, బ్లాక్ పబ్లిక్ యూనిట్స్ భవన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రూ.6.18 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పరవాడలో ఓ ప్రకటన విడుదల చేశారు సబ్బవరం, పరవాడ మండలాల్లో 21 హెల్త్ విలేజ్ క్లినిక్స్ భవన నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు.