బీటెక్ సీట్లు పెంచుకోవాలంటే కచ్చితంగా మూడు కోర్ ఇంజినీరింగ్ బ్రాంచ్ కోర్సులు తప్పనిసరిగా ఉండాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతుల విధాన పత్రాన్ని తాజాగా విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌కు సంబంధం లేనివి కనీసం రెండు కోర్ బ్రాంచీలు ఉంటేనే అదనపు సీట్లు మంజూరు చేస్తామని పేర్కొంది.