పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్థిక సాయం చేశారు. ఆయన కూలీ పనికి వెళ్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో కేటీఆర్ ఆయనకు అండగా ఉంటానని మాటిచ్చారు.
KTR: తెలంగాణ కళాకారుడు కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య గురించి చాలామందికి తెలుసు. భీమ్లానాయక్ పాటతో ప్రపంచ అంతా పరిచయం అయ్యారు. దాంతో పద్మశ్రీ అవార్డు సైతం అందుకున్నారు. నేడు ఆయన పరిస్థితి దారుణంగా మారింది. విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. కిన్నెర మొగిలయ్యగా పేరు తెచ్చుకున్న ఈయన తాను కళకోసం చేస్తున్న కృషికి పద్మ శ్రీ అవార్డు వరించింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఆయన్ను ఆర్థికంగా ఆదుకుంది. తరువాత మళ్లీ మాములు పరిస్థితి నెలకొనడంతో రోజు గడవడానికి మొగిలయ్య భవన నిర్మాణ కూలీగా మారాడు. ఆయన కూలీ పని చేస్తున్న వీడియో ట్విట్టర్లో పెట్టి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. వెంటనే కేటీఆర్ స్పందించి ఆర్థికంగా ఆదుకుంటా అని ఎక్స్ వేదిక స్పందించారు.
అనకున్నట్టుగానే ఆదివారం మొగిలయ్యకు ఆర్థికంగా కొంత సాయం చేశారు. అంతేకాదు మొగులయ్యను వ్యక్తిగతంగా పార్టీ ఆదుకుంటుందని ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, వివేకానంద, ఏంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మొగిలయ్య కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని కేటీఆర్ ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయను సకాలంలో పింఛన్ వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వృద్దులు, కళాకారులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు అని నెటిజన్లు కామెంట్లు కామెంట్లు పెడుతున్నారు.