బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. రెండు ఒకటే అయితే కేసీఆర్ బిడ్డ ఎందుకు అరెస్ట్ అవుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రంలో ఈ సారి సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందన్నారు.
Autodrivers should be given a living wage.. Harish Rao
Harish Rao : బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. రెండు ఒకటే అయితే కేసీఆర్ బిడ్డ ఎందుకు అరెస్ట్ అవుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రంలో ఈ సారి సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్లో జరిగిన మీట్ ద ప్రెస్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేన్నారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇస్తే రాష్ట్రానికి ఒక్కట ఇవ్వలేదన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, నవోదయ స్కూళ్లు ఇవ్వలేదు. కేసీఆర్ తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చితే వడ్లు కొనకుండా వివక్ష చూపారంటూ ఆరోపించారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచిత కరెంటు, మెడికల్ కాలేజీలు, కొత్త జిల్లాలు, కేసీఆర్ కింట్, మంచినీళ్లు, తాగు నీళ్లు ఇచ్చిండు. బీజేపీ ఏం చేసింది. నల్లచట్టాలు తెచ్చి లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించి 700 మంది రైతులను బీజేపీ పొట్టనబెట్టుకుందన్నారు.
ప్రస్తుతం కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల కంటే బీఆర్ఎస్కే ఎక్కువ వస్తాయి. నిశ్శబ్ద విప్లవం రాష్ట్రంలో వస్తుంది. రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో నీళ్లు , కరెంటు పుష్కలంగా ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడా పరిస్థితి లేదని హరీశ్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారని సాక్షాత్తు ఆ పార్టీ నేతలైన అర్వింద్, మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. దీన్ని రేవంత్ రెడ్డి ఎందుకు ఖండించడం లేదో చెప్పాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు రాజకీయ ప్రయోజనాల కోసం ఏడు మండలాలను ఏపీకి ఇచ్చాయంటూ హరీశ్ రావు ఆరోపించారు. ఆరు గ్యారంటీలను అమలు చేశాకే కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.