»Electricity Commission Will Continue Supreme Court Shock To Kcr
Supreme Court: విద్యుత్ కమిషన్ కొనసాగుతుంది.. కేసీఆర్‌కు సుప్రీం షాక్
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసిన విద్యుత్‌పై విచారణ జరపాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిషన్‌ను రద్దు చేయాలంటే కేసీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. కమిషన్ కొనసాగుతుందని ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
Electricity Commission will continue.. Supreme Court shock to KCR
Supreme Court: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పాలనలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణపై విచారించాలని విద్యుత్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దాన్ని రద్దు చేయాలంటూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం అంశాల్లో విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసిహారెడ్డి ఛైర్మన్‌గా కమిషన్ ఏర్పాటు కక్షపూరితమని కేసీఆర్ ఆరోపించారు. తాజా ధర్మాసనం కమిషన్ రద్దు చేయడం లేదని తీర్పు ఇచ్చింది.
అలాగే ఈ విషయంలో కేసీఆర్‌కు కాస్త ఊరట కలిగించే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. కేసీఆర్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం డిస్మిస్ చేసింది. కమిషన్ విచారణ కొనసాగించాలని అయితే దీనిని జ్యుడీషియల్ ఎంక్వైరీ అనకుండా.. ఎంక్వైరీ కమిషన్‌గా వ్యవహరించాలని పేర్కొంది. అంతే కాకుండా కమిషన్ ఛైర్మన్‌గా నరసింహారెడ్డిని తప్పించింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ఆదేశించింది. ఛైర్మెన్‌ను మారుస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కమిషన్ ఛైర్మెన్ నరసింహారెడ్డి ఈ కమిషన్‌పై మీడియా సమావేశాన్ని పెట్టడాన్ని కోర్టు తప్పు పట్టింది. దేశంలో ఏ కమిషనం అయినా విచారించి, అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.