గువాహటి-హౌరా మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ రైలు ధరలను మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 3AC టికెట్ ధర రూ.2,300గా (భోజనంతో కలిపి) నిర్ణయించారు. ఇక 2AC ధర రూ.3,000 కాగా, 1AC ధర రూ.3,600. మొత్తం 16 కోచ్‌లతో ఉండే ఈ సెమీ హైస్పీడ్ రైలు ఈనెల 17 లేదా 18న పట్టాలెక్కే అవకాశం ఉంది. వేగంతో పాటు లగ్జరీ ప్రయాణం కోరుకునే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.